వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ॥

   పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥

   Each and every palace in Lanka is attached with a Bar and Cabare 

                ... ఇది లంకా నగరంపై ఉషశ్రీ విశ్లేషణ

 సుందరకాండలో హనుమంతునికి సీతాన్వేషణ సమయంలో కనిపించిన దృశ్యాలను వ ర్ణిస్తూ ఉషశ్రీ చేసిన వ్యాఖ్యానం.

 పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్షవ్యాఖ్యానాలలోనూ తెలుగు శ్రోతలపై చెరగని ముద్ర వేసిన ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ.

 ‘సమస్త సన్మంగళాని భవంతు...’ మొదలుకొని ‘స్వస్తి’ పలికే వరకూ ప్రత్యక్షరం స్పష్టంగా, సూటిగా జన హృదయాలను తాకేది ఉషశ్రీ వ్యాఖ్యానం.

 ‘సహదేవుడు నక్సలైటా?’ అన్న ఆయన విశ్లేషణ, అర్జునుడు విడిచిన బాణంతో సైంధవుడి శిరస్సు - సచిన్ టెండూల్కర్  కొట్టిన బంతిలా ఎగిరిపడింద’ని చేసిన సందర్భోచిత వ్యాఖ్యలు. ఆయన ఉపన్యాసాలని మళ్లీమళ్లీ వినేలా చేస్తాయి. 1973 నుంచి ఉషశ్రీ ధారావాహికంగా చేసిన రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు ఆకాశవాణికే వన్నె తెచ్చాయి. ధర్మసందేహాల పేరిట ప్రసారమైన ఈ అంశం ఆయనను శిఖరాగ్రాన నిలబెట్టాయి.

 వీరకాకాని అంతిమయాత్ర, గోదావరి నదిపై రోడ్డు రైలు వంతెన ప్రారంభోత్సవం, భద్రాద్రి రామయ్య కల్యాణం, కృష్ణాపుష్కరాల ప్రత్యక్ష వ్యాఖ్యానం (1980) తదితరాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాళ్లు. ఆరంభంలో ఆయన రాజగోపాలాచార్య ప్రసంగాలకు స్వేచ్ఛానువాదం చేశారు. సరళవచనం, గంభీర ప్రవచనం, ఆకర్షణీయమైన శైలి ఈ గళగంధర్వుని సొత్తు.

 ఆయనకు సంబంధించిన వివరాలను, వివిధ ప్రాంతాలలో చేసిన ప్రసంగాలను, సమర్పించిన కార్యక్రమాలను అందించడమే లక్ష్యంగా ఈ వెబ్‌సైట్ ప్రారంభించాం.

 - ఉషశ్రీ మిషన్..